టివి పెడితే చాలు ఎయిర్ టెల్ 4జి అంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. మొబైల్ లో ఎంత స్పీడ్ వచ్చేది బెట్ కట్టి మరి హడావిడి చేసే ఆ యాడ్ లో మోడల్ పేరు సాషా చెత్రి.. 16 ఏళ్ల వరకు డెహ్రాడూన్ లో ఉన్న ఈ అమ్మడు మోడల్ అవ్వాలనే కోరికతో జె.వి.ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యునికేషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లో డిగ్రీ పట్టా పొందింది. 


ఎయిర్ టెల్ యాడ్ తో అనుకోకుండా వచ్చిన అదృష్టాన్ని అమ్మడు ఎంతో బాగా చేసి తన కెరియర్ ఓ రేంజ్ కు వెళ్లేలా చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే సాషా తెలియని వారు ఉండరంటే నమ్మాలి.. ఎయిర్ టైల్ యాడ్ కంటే ముందు స్టేజ్ షోస్ లో సాంగ్స్ పాడిన ఈ అమ్మడు కట్టి బట్టి సినిమాలో చివర ఓ సాంగ్లో కూడా కనిపిస్తుంది.


ఎయిర్ టెల్ యాడ్ చేయడానికి ముందు చాలా పొడవైన జుట్టుతో ఉండే సాషా చత్రి ఎయిర్ టెల్ యాడ్ కోసం తన జుట్టును కత్తిరించుకుని చేసింది. వచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకున్న సాషా కెరియర్ లో అత్యున్నత స్థానానికి చేరుకుంది. తన జీవితంలో ఎప్పటికైనా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి రిలీజ్ చేయాలని అంటుంది సాషా.  


కేవలం మోడలింగ్ లోనే కాకుండా ఇంకా చాలా విషయాల్లో ఆమె పట్టు సాధించాలని కోరుకుంటుంది. ప్రస్తుతానికి ఎయిర్ టెల్ యాడ్ తో మొదలైన ఆమె ప్రస్థానం ఎన్నో మరెన్నో వాణిజ్య ప్రకటనలు చేసి సరికొత్త ట్రెండ్ సృష్టించాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: