అందరు అమ్మలూ ఒకటే! వాళ్ళకు జీవితమే వాళ్ళ పిల్లలనెలా పెంచిపెద్ద చేయాలో నేర్పుతుంది. వాళ్ళెక్కువ చదువుకోక పోయినా వాళ్ళ పిల్లలకేమని పాఠాలు చెప్పాలో, వాళ్ళకు తెలుసు! మా అమ్మా అంతే! ఆమెకు ఇంగితజ్ఞానం, తెలివీ ఎక్కువ. వాళ్ళ నాన్న స్కూలు హెడ్మాస్టరు. అందుకని ఆయన స్కూల్లోనే ఐదవ తరగతి వరకూ చదివింది. దీంతో ఆమెకు పెద్ద‌గా తెలివితేట‌లు లేవు అని పూర్వ కాలం అమ్మ‌ల‌ను నేటి త‌రం చాలా మంది చుల‌క‌న చేసి చూస్తారు. కొంత మంది త‌ల్ల‌లు చ‌దువుకుంటారు. కొంత మంది చ‌దువుకోరు అయినంత మాత్రాన త‌న బిడ్డ యోగ క్షేమాల‌ను చూసుకునే విష‌యంలో మాత్రం ఏత‌ల్లైనా ఒకేలా ప్ర‌వ‌ర్తిస్తుంది. 

 

చాలా మంది పిల్ల‌లు త‌ల్లి చ‌దువుకోకపోతే ఆమె మాట‌ను పెడ‌చెవిన పెడుతుంటారు. త‌ల్లి అన్నాక మంచి చెడుల‌ను బిడ్డ‌ల‌కు నేర్పే విష‌యంలో ఎప్పుడూ ఏ త‌ల్లైనా స‌రే మంచే చేయాల‌ని అనుకుంట‌ది. కానీ బిడ్డ‌లు మాత్రం ఆమె త‌ల్లికి లోక‌జ్ఞానం తెలియ‌దనుకుంటారు. కానీ వాళ్ళ‌కు అర్ధం కాని విష‌యం ఏమిటంటే వారి త‌ల్లిదండ్రులుకూడా అదే వ‌య‌సు నుంచి వ‌చ్చార‌న్న‌ది. అలాగే ఈ రోజుల్లో ఏ త‌ల్లిదండ్రులైనా స‌రే వాళ్ళు చ‌దువుకోక‌పోయినా క‌నీసం త‌న బిడ్డ‌లైనా చ‌దువుకుని మంచి అభివృద్ధిలోకి రావాల‌ని కోరుకుంటారు. 

 

త‌ల్లి త‌న బిడ్డ‌ల‌కు నేర్పించే మంచి అల‌వాట్లు ఎవ‌రైనా ఒకేలా నేర్పిస్తారు. అలాగే ప్రేమ కూడా ఒకే విధంగా ఉంటుంది. త‌ల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ల్లి నేర్పే పాఠాలే బిడ్డ‌కు మొద‌టి పాఠాలు అవుతాయి. త‌ల్లే బిడ్డ‌కు మొద‌టి గురువు. పిల్ల‌లు ఏ విష‌యాన్నైనా స‌రే ముందు త‌ల్లి నుంచి నేర్చుకున్నాకే స్కూలుకు వెళ‌తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: