ఎప్పుడైనా ఆలూ మజ్జిగ పులుసు ఇంట్లోనే చేసుకొని తిన్నారా? ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఇంట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు మనకు ఈ ఆలూ మజ్జిగ చేసి పెడుతారు.. మరి ఇంట్లో అమ్మకు రాదు.. మీకు అయినా రావాలి కదా! అసలు ఈ ఆలూ మజ్జిగా పులుసు ఎలా చేయాలో మీకు తెలుసా? తెలియకపోతే ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

బంగాళా దుంపలు- నాలుగు, 

 

పెరుగు- 3 కప్పులు, 

 

సెనగపిండి- 2 టేబుల్‌ స్పూన్లు, 

 

ఆవాలు- టీ స్పూను, 

 

మెంతులు- అర టీస్పూను,

 

 జీలకర్ర- టీస్పూను, 

 

ఇంగువ- చిటికెడు, 

 

పచ్చిమిర్చి- నాలుగు, 

 

మిరియాలపొడి- అరటీస్పూను, 

 

పసుపు- అరటీస్పూను, 

 

కారం- అర టీస్పూను, 

 

శొంఠి పొడి- అరటీస్పూను, 

 

ఉప్పు- తగినంత, 

 

కొత్తిమీర తురుము- కొద్దిగా, 

 

నూనె- టేబుల్‌స్పూను

 

తయారీ విధానం... 

 

బంగాళాదుంపలు ఉడికించి పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరవాత పాన్ లో కొద్దిగా నూనె వేసి ముక్కల మీద ఉప్పు చల్లి వేయించి పక్కన పెట్టాలి. పెరుగులో తగినన్ని నీళ్లు పోసి గిలకొట్టాలి. శనగ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసి గిలకొట్టిన పెరుగులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు వేయాలి. 

 

తరవాత ఉడికించి వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు సిమ్‌లో పెట్టి మిరియాలపొడి, కారం, శొంఠిపొడి, ఉప్పు వేసి ఓ నిమిషం మగ్గిన తరవాత శనగపిండి కలిపిన పెరుగు వేసి నెమ్మదిగా తిప్పుతూ మరిగించాలి. అంతే ఎంతో రుచికరమైన ఆలూ మజ్జిగ పులుసు రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: