గ‌ర్భం పొంద‌డం అనేది ప్ర‌తి మ‌హిళ జీవితంలో ఓ ముఖ్య‌మైన సంద‌ర్భం. పెళ్లైన ప్ర‌తి మ‌హిళా త‌ల్లి కావాల‌ని కోరుకుంటుంది. అయితే గ‌ర్భం పొందిన త‌ర్వాత అన్ని విష‌యాల్లోనూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందులోనూ ఆహార విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్పుడే బిడ్డ ఆరోగ్యం పుడ‌తారు. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

 

ఇందులో భాగంగా ప్రెగ్నెన్సీ మహిళలకు గుడ్డు అత్యుతమ ఆహారం. ఇది తల్లికి పూర్తి పోషణ అందిస్తుంది. గర్భిణీలు రెగ్యులర్ గా గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నిక్షేపాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. గర్భిణీలు ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలను కలిగి ఉంటే గుడ్డులోని పచ్చసొన తినకుండా ఉండ‌డం మంచిది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గుడ్డు మంచిది. 

 

శిశువులలో సంభవించే నాడీ సంబంధిత సమస్యలను నివారించడం చాలా అవసరం. అందుకోసం గుడ్లు గొప్పగా ఉప‌యోగ‌ప‌డుతుంది. గుడ్లలో ఖనిజాలు, కోలిన్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి బాగా యూజ్ అవుతాయి. మ‌రియు గుడ్డు గుండె ఆరోగ్యానికి చాలా బాగా ప‌ని చేస్తుంది. ఇది శిశువుకు గుండె సమస్యలతో బాధపడకుండా ఉండటానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబ‌ట్టి.. ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు ఖ‌చ్చితంగా ప్ర‌తిరోజు గుడ్డును తినాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: