వేసవి కాలంలో ఏ పని చేయాలన్నా చిరాకు కలుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు తల్లిబరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును  కూడా మోస్తుండడంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హార్మోన్ల మార్పులతో శరీరంలో వేడి ఆవిర్లు వంటివి మరింత ఇబ్బంది కల్గిస్తాయి. సాధారణంగా మహిళలు గర్భం పొందిన తర్వాత వారిలో మామూలు కంటే బేసల్‌ టెంపరేచర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బేసల్‌ టెంపరేచర్‌కు వాతావరణం వేడి కూడా జత అయితే పరిస్థితి అసౌకర్యం గా ఉంటుంది.

 

అయితే చలికాలంలో లాగా మందంగా ఉన్న దుస్తులు ధరించడం, స్కార్ఫులు వంటి వాటితో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో గర్భిణీలు సౌకర్యవంతమైన వదులు గా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే చాలా తేలికగా ఉండే ప్రింటెడ్‌ షిఫాన్‌, కాటన్‌ దుస్తులు మీ అందాన్ని మరింత రిఫ్రెష్‌ చేస్తాయి. అంతేకాకుండా వీటితోపాటు గర్భిణీలు తీసుకోవాల్సిన మరికొన్ని టిప్స్‌..ముఖ్యంగా లైట్‌గా, వదులుగా ఉండాలి. వేసుకునే మెటీరి యల్‌ సాప్ట్‌గా, సౌకర్యవంతంగా ఉండాలి.

 

ప్రెగ్నెంట్  మహిళ ధరించే దుస్తులు లైట్‌ కలర్‌ ఉండాలి. ఎందుకంటే డార్క్‌ కలర్‌ దుస్తులు చాలా త్వరగా వేడిని గ్రహిస్తాయి. కాటన్‌ లేదా లెనిన్‌ సౌకర్యవం తంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి చెమటను చాలా సులభంగా గ్రహించడమే కాక వేసవి ఎండ తీవ్రతను ఎదుర్కొవడానికి సహాయపడతాయి.సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలి.వేసవిలో శరీరంలో పట్టే చెమటల కారణంగా గర్భిణీ డీహైడ్రేషన్‌ తప్పించుకోవాలంటే ఎక్కువగా ద్రవాలు, తాజా జ్యూసులు,కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రానిక్ పౌడర్, గ్లూకోస్ వాటర్,  నీరు ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రోజుకు 3-4లీటర్ల నీరు తీసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్భూజ వంటి పండ్లు తీసుకోవాలి. కెఫినేటెడ్‌, సాప్ట్‌ డ్రింక్స్‌ని తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్‌ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

 

డీహైడ్రేషన్‌ వల్ల నెలల నిండకుండానే నొప్పులు రావడం, కాళ్ళు వాపులువచ్చే అవకాశం ఉంది.వేసవిలో గర్భిణీలకు విశ్రాంతి చాలా అవసరం. మద్యాహ్నం సమయంలో కూడా కనీసం ఒక గంట అయినా రెస్ట్‌ తీసుకోవడం మంచింది. రాత్రి 7నుంచి 8గంటల విశ్రాంతి అవసరం.వేసవిలో వేడి నుండి ఉపశమనం పొందాలంటే తరచూ గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచి మార్గం. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి కూడా దొరుకుతుంది.గర్భిణీలలో వాటర్‌ తగ్గడం వల్ల వచ్చే కాళ్ళ వాపులను తగ్గించుకోవాలంటే ఆహారంలో ఉప్పును తగ్గించాలి.

 

ఉప్పు ఎక్కువగా వాడకూడదు దీనివల్ల బీపీ పెరుగుతుంది. కాళ్ళకు చల్లగా ఉండేలా సౌకర్యవంతమైన ఫ్లిప్‌ప్లాప్స్‌ ధరించాలి. శాండిల్స్‌, బూట్లు ధరించకూడదు.వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వ్యాయామం చేయాలి. ఎర్లీ మార్నింగ్‌, లేట్‌ ఈవెనింగ్‌ స మయాల్లో వ్యాయామంను ఎంపిక చేసుకోవాలి.అలాగే ఇంటివాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.. హాస్పిటల్ కి చెక్ అప్ కి వెళ్లాలంటే సాయంత్రం పూట వెళ్లడం ఉత్తమం. ఎండ బారిన పడకుండా ఉంటారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: