అమ్మ.. ఆ పేరులోనే ప్రేమని నింపుకున్న అమృత మూర్తి. అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి పెంచుతుంది. లాలించు పాటలో నీతంతా తెలిపి మంచి వాళ్లను చేస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. అమ్మ ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది మ‌రి. అందుకే కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. 

 

అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుంది. మ‌న జీవితంలో ఎవరు తోడు ఉన్నా.. లేకపోయినా.. మన వెన్నంటే ఉండి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు దూసుకెళ్లమని చెప్పే శక్తి ఒకే ఒక అమ్మకు మాత్రమే ఉందనడంలో సందేహ‌మే లేదు. ఇక పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతోన్న మాతృమూర్తుల కోసం ప్రతీ ఏటా 'మదర్స్ డే' నిర్వహిస్తున్నారు. మే రెండో ఆదివారం రోజున జరుపుకొంటారు. అంటే రేపే మ‌ద‌ర్స్ డే. మ‌రి అలాంటి అమ్మ‌కు మనసారా హత్తుకునే కోట్స్‌తో విష్ చేయండి మ‌రి.

 

1. ``గుడి లేని దైవం అమ్మ.. 
కల్మషం లేని ప్రేమ అమ్మ.. 
నా పెదవిన పలికే తీయనైన పదం అమ్మ.. 
నా గుండెలో మెదిలే ప్రతీ మాట నీవే అమ్మ``- హ్యాపీ మదర్స్ డే..


 
2. ``పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ..
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. 
మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా``- హ్యాపీ మదర్స్ డే..

 

3. ``పది మందిలో ఒక్కరు.. 
వంద మందిలో ఒక్కరు.. 
కోట్లలో ఒక్కరు.. 
నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. మా అమ్మ`` - హ్యాపీ మదర్స్ డే..

 

4. ``కళ్లు తెరిచిన క్షణం నుంచి..
బంధం కోసం.. బాధ్యత కోసం..
కుటుంబం కోసం..
అందరినీ కనుపాపలా తలచి..
ఆత్మీయతను పంచి..
తనవారి కోసం అహర్నిశలు కష్టించి..
తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు`` - హ్యాపీ మదర్స్ డే..

 

5. ``ఈ విశ్వంలో అందం, ఐశ్వర్యం చూడకుండా..
 ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ.. 
తల్లి ప్రేమ నిర్మలమైనది..
దానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేము``- హ్యాపీ మదర్స్ డే..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: