శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలియక మన దగ్గర చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే చాలు మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

 

గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం.

 

ఆడవాళ్ళకి అనేక రకాలైన రంగులు కుడా చేతి వేళ్ళకి వాడేస్తూ ఉంటారు.తరువాత గోళ్ళకి ఉన్న రంగులు పోకపోవడం వలన నెయిల్ పాలిష్ ను తొలగించుకోవడానికి చాల కష్టాలు పడుతుంటారు.గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే. కానీ ఎల్పప్పుడూ గోళ్లను రంగులతో కప్పివేయకూడదు.గోళ్లరంగును తొలగించడం కోసం అసిటోన్ కలసిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను వాడకండి. అసిటోన్ కలవని సాధారణ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడడమే మేలు.ఏది పడితే అది వాడి గోళ్ళని పాడుచేసుకోకండి. 

 

మళ్ళీ వాటిని పోగొట్టడానికి ఏవో క్రీమ్స్ లోషన్స్ వాడుతారు అలాంటివి వాడటం వలన గోళ్ళు పాడవుతాయి.గోళ్ళు పాడవకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

 

కొద్దిగా టూత్ పేస్టూ ని తీసుకుని గోళ్ళపై రాసి తరువాత కాటన్ తో నెమ్మదిగా రుద్దితే గోళ్ల మీద వున్న రంగు పోతుంది.పాతబడిపోయిన నెయిల్‌ పాలిష్‌ను తీసుకొని గోళ్లపై పోయాలి. మొత్తంగా నెయిల్‌పాలిష్‌ సులువుగా తొలగిపోతుంది.అలాగే వెనిగర్ తో గోళ్ళపై ఉన్న రంగును తొలగించుకోవచ్చు.కాటన్ బాల్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి గోళ్లపై రుద్దాలి.గోరువెచ్చని నీటిలో గోళ్ళని ముంచి పది నిమిషాలు తరువాత తీసివేసి కాటన్ తో తుడిస్తే చాలు.గోళ్లకు ఉన్న రంగు పూర్తిగా పోతుంది. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: