ఈ ఐరన్ మన శరీరానికి తీసుకునే ఆహరం నుండి అందుతుంది.ఆడవాళ్లకు రక్త శాతం తక్కువగా ఉన్నపుడు చర్మం పాలిపోయినట్లు అనిపిస్తుంది.మనం జీవించడానికి నీరు ఎంత అవసరమో అలాగే మన శరీరం సరిగ్గా పని చేయాలంటే రక్తం కూడా అంతే అవసరం. ఈ రక్త హీనత సమస్యను ఆడవాళ్లు తేలికగా తీసుకుని పట్టించుకోకపోతే భవిష్యత్తులో చాలా అనారోగ్యాల బారిన పడతారు. అందుకే ఆడవాళ్లకు రక్తం పడడానికి కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినాలి అవేంటో చూద్దాం.. !!మీకు తెలుసా…నట్స్’ని తినటం వలన మన శరీరానికి కావలసిన ఐరన్ పొందవచ్చు అని. జీడిపప్పు మంచి రుచికరమైన గింజలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రుచిని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.ఎలా జీడిపప్పులు తినడం వల్ల రక్తం శాతం పెరుగుతుంది.
జీడిపప్పుని పచ్చిగా తినవచ్చు లేదా ఉప్పు, చక్కర కలుపుకొని కూడా తినవచ్చు.అలాగే వేరుశెనగ పప్పులను తినడం వల్ల కూడా రక్తం పడుతుంది వీటిని తినటం వలన శరీరానికి చాలా రకాల పోషకాలు అందింపబడతాయి. వేరుశనగ పప్పులలో ఐరన్’తో పాటూ పొటాషియం, మెగ్నీషియం, మరియు విటమిన్ ‘B’లు కూడా అధికంగా ఉంటాయి.అలాగే బాదం పప్పులు తినడం వల్ల కూడా రక్త శాతం పెరుగుతుంది.ఆడవాళ్లు కొంచెం శ్రద్ద తీసుకుని రాత్రి పడుకునే ముందు కిచెన్ లో పని అయిపోయాక నలుగు బాదాం పప్పులను నీటిలో నానపెట్టి పొద్దున్నే తింటే చాలా మంచిది. అలాగే ఆకుకూరలు కూడా తింటూ ఉండాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి