వేవిళ్ళు ఎక్కువగా మొదటికన్పులో కనబడతాయి. సాధారణంగా నెల తప్పిన పదిహేనురోజుల్లో వేవిళ్ళు ప్రారంభం అవుతాయి. ఇలా ప్రారంభమైన వేవిళ్ళు దాదాపు మూడవనెల నిండగానే లేకుండా పోతాయి. కొందరిలో ఇంకో నెలా రెండు నెలలు ఎక్కువ ఉంటాయి.స్త్రీ గర్భవతి అయినప్పుడు కొద్ది రోజుల్లోనే శరీరంలో అనేక మార్పులు గలుగుతాయి. శరీరంలో కలిగే అనేక రసాయనిక మార్పులవల్ల కడుపులో వికారం,వాంతులు ప్రారంభం అవుతాయి. ఐతే కొద్ది రోజుల్లోనే శరీరం ఈ రసాయనిక మార్పులకి తట్టుకుని మామూలుగా తయారవుతుంది. దానితో వికారం, వాంతులు తగ్గిపోతాయి. అయితే కొందరిలో ఈ రసాయనిక మార్పులవల్ల వచ్చే శారీరిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. ఈ మానసిక ఆందోళనవల్ల, భయంవల్ల వేవిళ్ళు తగ్గకపోవడం అటుంచి పెరిగిపోతాయి.
స్త్రీ గర్భవతి అయినప్పుడు హార్మోన్లలో కొంత మార్పులు ఏర్పడతాయి . ప్రొజస్టిరోన్ హార్మోను తక్కువ అయిపోయి కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను ఎక్కువ అవడం వేవిళ్ళకి ఒక కారణంగా కూడా భావించబడుతుంది. కొందరిలో కడుపు వచ్చినప్పుడు కొన్ని ఎలర్జీ పరిస్థితులు ఏర్పడి దానివల్ల వాంతులు కలుగుతాయనే భావం ఉంది. ఏది ఏమైనా వేవిళ్ళు ఉన్నప్పుడు పుల్ల పుల్లగా తినాలి అని అనిపిస్తుంది.. అయితే వేవిళ్లు మరి ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుడిని తప్పక సంప్రదించండి.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి