ఆడవాళ్ళని తలుచుకుంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది వాళ్ళ అందం.. ముఖం అందంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ అందాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్లో దొరికే క్రీమ్స్ ను వాడుతూ ఉంటారు. అయితే కెమికల్స్ కలిపిన క్రీమ్స్ వాడే బదులు మన ఇంట్లో దొరికే పదార్ధాలతో అందాన్ని సహజంగా కాపాడుకోవచ్చు.. అదెలానో చుడండి.. !! కోడి గుడ్డు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. ఆమ్లెట్ వేసిన, కూరలో వేసిన గాని ఇష్టపడి మరి తింటాము. కానీ  గుడ్డులో ఉన్న ఒక్క డిస్ అడ్వాంటేజ్ ఏంటంటే వాసన.. చాలామందికి కోడిగుడ్డు వాసన అంటే ఇష్టం ఉండదు. కానీ అందం కావాలనుకుంటే కోడిగుడ్డు వాడక తప్పదు. గుడ్డు  ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. గుడ్డుతో ఎలాంటి చిట్కాలు ఒక్కసారి పాటించి చుడండి.!



గుడ్డులోని తెల్ల సొనని ఒక గిన్నెలోకి తీసుకుని  అరచెమ్చా నిమ్మరసం, చాలా తక్కువగా తేనె, కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే కడిగితే ముఖం కాంతి వంతంగా మారుతుంది . చర్మం రంద్రాలు తెరుచుకునేలా చేసే ఈ ప్యాక్ కంటికింది వలయాలు, ముఖం మీది మచ్చలని కూడా దూరం చేస్తుంది.అలాగే తెల్ల సోనకి ఒక చెంచా పాలు, ఒక చెంచా క్యారట్ తురుము కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని పావుగంట వుంచుకోవాలి. యాంటీ ఏజింగ్ ప్యాక్ ఇది. చర్మం నిగనిగ లాడేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల వయసు యవ్వనభరితమైన చర్మం మీ సొంతం అవుతుంది.



అలాగే పచ్చ  సోనకి  తేనెతో పాటు రెండు చెంచాల పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుని ఓ పావుగంట తర్వాత కడుగుకుంటే.. చర్మం బిగుతుగా మారుతుంది .స్కిన్ అనేది వదులుగా కాకుండా బిగుతుగా ఉంటుంది.చర్మం పొడి పొడి గా వుండి, దాని వాల్ల ఇబ్బంది పడేవారు పచ్చ సొనకి చెంచా తేనె కలిపి రాసుకుని.. పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం వుంటుంది.అలాగే పచ్చసోనలో ముల్తాని మిట్టి ని కలిపి రాసుకుంటే జిడ్డు చర్మం బాధ నుంచి తప్పించుకోవచ్చు.
ఒట్టి తెల్ల సొనని  బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించి వుంచి, అది ఆరాకా కడిగి చూడండి. ముఖం లో మంచి కాంతి కనిపిస్తుంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: