చాలామంది ఆడవాళ్లు నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ నీలగిరి తైలం అనేది నొప్పుల నివారణకు సహజ సిద్ద ఔషధంలా పనిచేస్తుంది. శారీరక, కీళ్ళ నొప్పులు తగ్గించి మైండ్ కు రిలాక్సేషన్ ఇస్తుంది. బకెట్ వేడి నీటిలో కొద్ది చుక్కలు వేసి స్నానం చేస్తే ఎంతో హాయిగా వుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు కావాలంటే దీనితో లవెండర్ కలపండి. అలాగే ఆడవాళ్ళని వేదించే సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. అందుకనే వెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడేవారు నీలగిరి తైలాన్ని రోజూ కొంత మోతాదులో జుట్టుకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. అంతేకాదు జుట్టులో పేలు బాగా ఉన్నవారు నీలగిరి తైలాన్ని తరచూ మర్దనా చేసి తలస్నానం చేస్తే పేలు పోతాయి.
అంతేకాదు ప్రతి రోజు మీరు వాడే పేస్టులో యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపి దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆడవాళ్లు ఈ నూనెని రాసుకుంటే చర్మం నునుపు రావటం, చర్మంపై మచ్చలు పోవడం జరుగుతుంది. యూకలిప్టస్ ఆయిల్ ను శనగపిండితో కలిపి రాస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే చర్మం కూడా మృదువుగా మారుతుంది తద్వారా ఆడవాళ్లు చూడడానికి చాలా అందంగా కనపడతారు. అల్లం ముద్దను ఆడవాళ్ళ నడుము మీద రాసుకుని , ఆ తరువాత యూకలిప్టస్ (నీలగిరి) తైలాన్ని మృదువుగా మర్ధనా చేసుకుంటే నడుమునొప్పిలో ఉపశమనం లభిస్తుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి