మెర్సీ కిల్లింగ్‌కు చట్టపరమైన గుర్తింపు ఇచ్చే బిల్లును పోర్చుగల్ పార్లమెంటు ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు 136 ఓట్లు అనుకూలంగా, 78 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం కోసం ప్రెసిడెంట్‌కు పంపారు. ప్రెసిడెంట్‌ సంతకం చేసిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. ఆ దేశాధ్యక్షుడు బిల్లుపై సంతకం చేసిన పక్షంలో ఈ రకం చట్టం తీసుకొచ్చిన ఐరోపాలో నాల్గవ దేశంగా.. ప్రపంచంలో 7 వ దేశంగా అవతరించనున్నది. అయితే ఈ బిల్లు ఎవరికీ వర్తిస్తుందో చూద్దమా మరి.

ఇక ఈ బిల్లు ప్రకారం.. మెర్సీ కిల్లింగ్‌ కోరుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అతనికి తీవ్రమైన గాయం లేదా ఏదైనా ప్రాణాంతక వ్యాధి ఉండి నయం చేయలేని పరిస్థితులు ఉండాలి. అతను భరించలేని నొప్పితో బాధపడుతూ.. పూర్తిగా స్పృహలో ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే వైద్యుల సలహా మేరకు మాత్రమే మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వబడుతుంది. వైద్యులు, నర్సులు ఈ రకం మరణాలను తిరస్కరించవచ్చని  బిల్లులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో వారు రాష్ట్రపతి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కేసును కోర్టుకు సూచించడానికి లేదా నేరుగా కొట్టివేయడానికి రాష్ట్రపతి వీటోను ఉపయోగించుకునే అధికారం ఉన్నది.

ఇక భారతదేశంలో కూడా ఈ రకం మరణాలకు డిమాండ్‌ పెరుగుతున్నది. ఆరవై ఆరేళ్లు ప్రాణాలతో ఉన్నా.. 42 ఏళ్లు అపస్మారక స్థితిలోనే గడిపారుమే. ఆమె అరుణా షాన్‌బాగ్‌. ముంబైలోని కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో అరుణ నర్సుగా పనిచేసేవారు. 1973లో సోహన్‌లాల్‌ వాల్మికీ అనే వార్డ్‌బాయ్‌ ఆమెపై ఘోరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గొలుసుతో ఆమె మెడను బిగించి హత్యాయత్నం చేశాడు. వెంటనే అరుణ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. 37 ఏళ్ల తర్వాత ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకీ విరానీ అరుణ కారుణ్య మరణానికి అనుమతిని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తిరస్కరిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. 2015లో అపస్మారక స్థితిలో ఉండగానే న్యుమోనియా వ్యాధితో అరుణ ప్రాణాలు విడిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: