అయితే నేడు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు విమెన్స్ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తమ జీవితంలో భాగమైన మహిళలందరికీ కృతఙ్ఞతలు చెబుతున్నారు. మహిళలు లేకుంటే సృష్టి జరగదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో మహిళల గొప్పదనాన్ని వివరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా విమెన్స్ డే సందర్భంగా ప్రముఖ గాయని సునీత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాను తీసుకున్న ఓ స్టైలిష్ ఫొటోను షేర్ చేసిన సునీత.. ఓ భావోద్వేగ పోస్ట్‌ని పెట్టారు.
ఇక నన్ను జడ్జ్ చేశారు, నన్ను ట్రోల్ చేశారు, నన్ను ఎదగనివ్వకుండా చేశారు, నన్ను తప్పని నిరూపించడానికి ప్రయత్నించారు, నన్ను ఇబ్బంది పడేలా చేశారు, నన్ను నమ్మలేదు, నాకు మద్దతివ్వలేదు. కనీసం నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. నేను ఓడిపోయినప్పుడు మీరు నవ్వారు, కారణం లేకపోయినా నన్ను నిందించారు. ఇప్పుడు నాకు హ్యాపీ విమెన్స్ డే చెబుతున్నారు.
ఇక అయినా నేను దాన్ని స్వీకరిస్తా. ఎందుకంటే నువ్వు నా మీద విసిరేసిన రాళ్లతో నా సొంతగా ఒక భవనాన్ని కట్టుకున్నారు. నేను నవ్వాను, నేను క్షమిస్తాను, రక్షిస్తాను, ప్రేమిస్తాను. నేను అసలు వెనక్కి తగ్గను. నేను ఒక మహిళను. హ్యాపీ విమెన్స్‌డే అని సునీత పోస్ట్ పెట్టారు. కాగా ఇటీవలే రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత.. ఇటు వ్యక్తిగతంగానూ, అటు కెరీర్ పరంగానూ బిజీగా గడుపుతున్నారు. అలాగే ఇటీవల బిజినెస్ రంగంలోకి దిగారు సునీత. మొత్తానికి పెళ్లి తరువాత మరింత బిజీగా మారారు సునీత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి