మన భారతదేశానికి స్వాతంత్య్రం రావడం వెనుక ఎంతో మంది మహానుభావుల కృషి వారి యొక్క ప్రాణత్యాగం ఉంది. అయితే చాలా మందికి కేవలం కొంత మంది గురించి మాత్రమే తెలుసు. అటువంటి వారిలో మహాత్మ గాంధీ, నెహ్రూ, వల్లభభాయ్ పటేల్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు, రుద్రమదేవి, మదర్ థెరిస్సా, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్ లాంటి వారున్నారు. కానీ ప్రజలకు తెలియని ఎంతో మంది స్వాతంత్య్రం కోసం తమ వంతుగా పోరాటం చేశారు. అటువంటి వారిలో ఒకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళలు సైతం మగవారికి ధీటుగా వివిధ రంగాలలో, వివిధ హక్కుల కోసం పోరాడి దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టారు. ముత్తులక్ష్మి రెడ్డి అనే మహిళ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈమె పుదుక్కోటై చెన్నైలో 1886 జులై 30 వ తేదీన జన్మించారు.

ఈమె గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఆమె గురించి కొన్ని గొప్ప విషయాలను తెలుసుకుందాము.

* ఆనాడు బ్రిటిష్ వారు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో బ్రిటిష్ ఇండియాలో 1927  వ సంవత్సరంలో ముత్తులక్ష్మి ఎమ్మెల్యే గా ఎన్నిక కాబడ్డారు. అప్పటి వరకు మన దేశం నుండి ఎన్నిక అయిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.  

* ఈమె ఎమ్మెల్యేగా ఉన్న పదవీ కాలంలో మహిళల హక్కుల కోసం ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా అప్పట్లో మహిళలు బలవంతంగా అనుభవిస్తున్న దేవదాసీ వ్యవస్థను రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మహిళలకు పెళ్లి చేసుకునే వయసును పెంచడంలో తనదైన ముద్ర వేసింది.

* చిన్న పిల్లలకు దక్కాల్సిన హక్కుల కొరకై  పోరాడి విజయం సాధించారు. మహిళలపై జరిగే వ్యభిచార ఆచారాలను రద్దు చేయించడంలో జులుం విదిల్చారు.

* శ్రీమతి సరోజినీ నాయుడును చూసి ఆమె ప్రోద్బలంతో ఇవన్నీ సాధించింది. అంతటి పోరాట పటిమను సొంతం చేసుకుంది.

* ఆఖరుకు ముత్తు లక్ష్మి మహాత్మ గాంధీతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడానికి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, దేశంపై తనకున్న భక్తిని చాటుకుంది.

* ఈమె చాలా విషయాల్లో దేశంలోని మిగతా మహిళల కన్నా ముందుగా సాధించారు.

* ఈమె అప్పట్లో మెడిసిన్ చదవడానికి చేరిన కాలేజీ లో ఈమె ఒక్కటే మహిళ  కావడం విశేషం. కానీ అందరూ మగవాళ్ళున్న కాలేజీలో ఒక్క అమ్మాయే చదవడం అంటే ఈమెకు ఎంత ధైర్యముందో ఉంటుందో ఒకసారి ఆలోచించండి.

* మన భారతదేశంలో ఉన్న మహిళలలో మొట్టమొదటి హౌస్ సర్జన్ ఈవిడే కావడం విశేషం. ఈమె 1912 వ సంవత్సరంలో సర్జన్ అయింది. అంతే కాకుండా స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు మొట్టమొదటి చైర్ పర్సన్ గా కూడా ఎన్నికయ్యారు.

* ఈమె ఎమ్మెల్యేగా ఎన్నికయిన సమయంలో ఆ కౌన్సిల్ లో తొలి మహిళ డిప్యూటీ ప్రెసిడెంట్ అయ్యారు.

ఈమె దేశానికి వివిధ రంగాలలో చేసిన కృషి మరియు సేవకు గానూ భారత ప్రభుత్వం ఈమెను పద్మభూషణ్ బిరుదుతో ఘనంగా సత్కరించారు.  ఈమె ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు.










మరింత సమాచారం తెలుసుకోండి: