సాధారణంగా పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు ఎడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగా మారుతుంది. ఇక పిల్లలను చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాటిని ఇవ్వడం, వాళ్ళ పనులు చేయడం నిజంగా ఇవన్నీ కాస్త కష్టంగా మారుతుంది. అయితే బిడ్డకు జన్మించిన తరువాత  కాస్త ఒత్తిడి, అలసిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటుంది. కాగా.. ఒకరి నుండి మరొకరికి వీటి యొక్క లక్షణాలు వేరు వేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే పిల్లలు పుట్టాక ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, నిద్ర పట్టకపోవడం, నొప్పులు ఉండడం, ఆసక్తి లేకపోవడం, బాధగా ఉండడం, గిల్టీగా ఉండడం, బాధ ఎక్కువగా ఉండడం లాంటివి కనపడతాయని చెబుతున్నారు. ఇక బిడ్డ పుట్టిన తరువాత అందరి మగవారిలో ఇవి కనిపిస్తుంటాయి. అయితే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా మంది చేయించుకోరు.

తాజా అధ్యయనం ప్రకారం.. డిప్రెషన్ గురయ్యే వారిలో ఎనిమిది శాతం ఉన్నట్లు తెలిపారు. ఇక డిప్రెషన్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అఫ్ డిప్రెషన్, ఆర్థిక సమస్యలు, సోషల్ లేదా ఎమోషనల్ సపోర్ట్ లేక పోవడం, తండ్రి బాధ్యతలు తలుచుకుని బాధ పడడం, కుటుంబ సభ్యులు లేదా భార్యతో ఉండే రిలేషన్షిప్ పైన ఒత్తిడి కనిపించటం ఇలాంటివి చూడొచ్చునని చెప్పుకొచ్చారు. అంతేకాక మహిళల్లో వచ్చే డిప్రెషన్ ని సులువుగా పరీక్షించుకోవచ్చున్నారు. కాగా.. పురుషుల్లో ఇది కాస్త కష్టం అని చెబుతున్నారు.

ఇక ఒకవేళ కనుక తీవ్రమైన లక్షణాలు కనుక ఉంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు డిప్రెషన్ నుండి బయట పడటానికి వీలవుతుందని తెలిపారు. అంతేకాక.. మీరు ఈ కొత్త జీవితానికి అలవాటు పడలేకపోతే ఎక్స్పర్ట్‌ని కన్సల్ట్ చేయాలని సూచించారు. కాగా.. డిప్రెషన్ అనేది చాలా సీరియస్‌గా ఉండే మానసిక సమస్య. ఇది వీలైనంత వరకు మానసిక నిపుణుడిని కన్సల్ట్ చేసి దీనిని పరిష్కరించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: