అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అత్తగా నటించి తెలుగు పెక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమాలో ఈమెకు మరియు పవన్ కు ఉన్న ఎమోషనల్ జర్నీ ప్రేక్షకుల కంట నీరు తెప్పించింది అని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ తర్వాత నదియా ఎందరో డైరెక్టర్ లకు కొన్ని ముఖ్యమైన పాత్రలకు పెర్ఫెక్ట్ సూట్ అని అనిపించుకుంది. అలా ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నదియా గురించి పాత వార్తలు కొన్ని గుప్పుమంటున్నాయి. నదియాకు నటన కొత్త ఏమీ కాదు. గతంలో చాలా సినిమాలలో హీరోయిన్ గా మరియు సహాయక పాత్రలలో నటించి తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకుంది.

ఎక్కువగా నదియా అప్పటి తక్కువ రేంజ్ ఉన్న హీరో సురేష్ తో సినిమాలు చేసింది. అయితే సురేష్ కు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఈజీగానే హీరోగా అవతారం ఎత్తాడు. అలా తన మొదటి సినిమా  తమిళ్ లో నదియా తో కలిసి చేశాడు. అయితే అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. దాంతో దర్శక నిర్మాతలు వీరిది హిట్ పెయిర్ గా భావించి వరుస సినిమాలను చేసేవారు. ఆ విధంగా ఈ ఇద్దరు కొన్ని సినిమాలలో నటించడం జరగగానే... ఎప్పటిలాగే ఇండస్ట్రీ వర్గాలు మరియు గాసిప్ రాయుళ్లు సురేష్ మరియు నదియాల మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలను స్ప్రెడ్ చేశారు. అయితే ఇద్దరూ కూడా ఈ వార్తల వలన చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి.

ముఖ్యంగా సురేష్ చొరవ తీసుకుని ఆమెతో మాట్లాడి ఇక మీతో సినిమాలో నటించను అంటూ తప్పుకున్నాడట. అంతటితో ఆగకుండా తాను వేరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక నదియా కూడా ఒక ఎన్ ఆర్ ఐ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అయితే వీరి మధ్య ఇలాంటి గాసిప్ లు రాకుండా ఉండి ఉంటే... నదియా మరి కొంతకాలం హీరోయిన్ గా ఉండేది అని ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: