హీరో మోటో కార్ప్ నుండి వచ్చిన డ్యుయెట్ స్కూటర్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే హీరో డ్యుయెట్ ను కొన్ని మార్పులతో పాటుగా పేరు కూడా మార్చి కొత్త హీరో డెస్టినీ 125గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. హీరో డ్యూయెట్ కు పోలినట్టే ఉండే ఈ స్కూటర్ అదనంగా ఫ్రెంట్ ఏప్రాన్, క్రోం డిలైట్స్ తో వస్తుంది.


ఇక 125 సిసితో వస్తున్న స్కూటర్స్ లో ఐ3ఎస్ టెక్నాలజీతో వస్తున్న స్కూటర్ గా ఇది ప్రాముఖ్యత తెచ్చుకుంది. ఇక రిలీజ్ అవనున్న ఈ సరికొత్త హీరో డెస్టినీ నాలుగు విభిన్న రంగులతో వస్తుంది. ఈ స్కూటర్స్ ఈ ఏడాది దసరా కల్లా మార్కెట్ లోకి రిలీజ్ కానున్నాయని తెలుస్తుంది.


హీరో నుండి కొత్తగా వస్తున్న ఈ సరికొత్త డెస్టినీ తప్పకుండా హీరో కస్టమర్స్ అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ హీరో డెస్టినీ ఎలా సేల్స్ కలిగి ఉంటుందో మార్కెట్ లోకి వచ్చాక కాని తెలుస్తుంది.     
 


మరింత సమాచారం తెలుసుకోండి: