ప్రస్తుతం భారతదేశంలో ఈ మధ్య కార్ల వినియోగం ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. మధ్యతరగతి రేఖకు పైన ఉన్న ప్రజలు కార్లని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక సంపన్నుల విషయానికి వస్తే వారు ఒకటే కాకుండా రెండు, మూడు కార్లు తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. ఇక అలాగే ముఖ్యంగా మనదేశంలో కార్లకి మంచి డిమాండ్ పెరుగుతోంది. చాలామంది కార్లో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని అనేక సర్వేలలో తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటికి వెళ్లేందుకు, అలాగే లాంగ్ డ్రైవ్ ల కోసం మరియు పర్యటనల కోసం ఇంకా అనేక రకాలుగా వీటిని వినియోగిస్తున్నారు.

 

అంతేకాకుండా ఇప్పుడు నగరాలలో ఓలా, ఉబెర్ ఇంకా ఇలాంటి వాటి ద్వారా అనేక కార్లు రోడ్ల మీదికి వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇక ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దానికి తగినట్లుగా ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించే సౌకర్యవంతమైన వాహనాలను తయారు చేసి మార్కెట్ లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఆటోమొబైల్ రంగాలు. కారులో పవర్ ఫుల్ ఏసి, మంచి క్యూషన్ సీట్లు అదిరిపోయే మ్యూజిక్ సిస్టం లాంటి కొన్ని సౌకర్యవంతమైన ఫీచర్లను ఈ కార్లలో కొత్తగా రూపొందిస్తున్నారు.

 

ఇంకా కొన్ని వాహనాల సంస్థలైతే ఏకంగా ప్యాసింజర్ సీట్లకే ఏసి సౌకర్యాన్ని అందించేస్తున్నాయి. ఇక ఈ కార్ల విషయానికి వస్తే ప్రస్తుతం మన భారత మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోయే కంపెనీల విషయం చూస్తే మారుతి సుజుకి, హోండా, మహీంద్రా ఆటో సంస్థలు ఇలా కొద్దిగా ఉన్నాయి. మరి ఇన్ని కంపెనీలలో ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించే బెస్ట్ ఫ్యామిలీ కార్ల వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దామా..?
​మారుతీ సుజుకీ స్విఫ్ట్, మారుతీ సుజుకీ డిజైర్, ​హోండా BR -V , మహీంద్రా జైలో, మారుతీ సుజుకీ ఎర్టిగా ఇలా వీటిని ఎన్నుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: