మహీంద్రా సంస్థకు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న మరో కొత్త మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో'.  కంపెనీ ఈ బైక్ ని కొత్త బిఎస్ 6 వెర్షన్ ‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌కు సంబంధించి మరో టీజర్ ఇమేజ్ ‌ను ఆన్లైన్ లో విడుదల చేసింది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన చిత్రంలో కంపెనీ ఇందులో ఆఫర్ చేయబోయే కొత్త పేమెంట్ స్కీమ్ ‌ను పరిచయం చేసింది. బ్లాక్, రెడ్ కలిసివుండే విధంగా సరికొత్త గార్నెట్ బ్లాక్ మోటార్‌సైకిల్ ‌ను కంపెనీ విడుదల చేసింది. దింతో ఈ బైక్ఈ కు కొత్త రంగు కలయిక మరింత క్యారెక్టర్‌ ను అందిస్తోంది.

 

IHG


అతి త్వరలోనే విడుదల కానున్న మహీంద్రా మోజో బిఎస్ 6 మోడల్ బైక్ ను ప్రస్తుత తరం మోడళ్ల మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌ ను క్యారీ చేయనున్నాయి. ఇక ఈ బైక్ లో డ్యూయెల్ హెడ్‌ల్యాంప్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,   పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి అన్ని ఇతర డిజైన్ అంశాలు బిఎస్ 6 మోడళ్లలో కూడా కొనసాగించే అవకాశం లేకపోలేదు. ఈ బైక్ ముందు వైపు 320 mm డిస్క్ బ్రేక్, వెనుక వైపు 240 mm డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్ - ఛానెల్ ఏబిఎస్ మనకు అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ముందు వైపు టెలిస్కోపిక్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ లాంటి లుక్ ని అందిస్తున్నారు ఈ బైక్ లో.  

IHG

 


ఇక ఇందులో ఇంజన్ అప్‌గ్రేడ్స్ తప్పించి డిజైన్ విషయం‌లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇక రాబోయే ఈ బైక్మ లో బిఎస్‌6 294.72 cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ‌ను ఉపయోగించబోతున్నారు. ఈ ఇంజన్ 7500 rpm వద్ద 26.29 bhp శక్తిని, 5500 rpm వద్ద 28 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ ‌బాక్స్ ‌తో పని చేస్తుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: