ప్రపంచంలో టెక్నాలజీ పెరిగేకొద్దీ కొత్త కొత్త వస్తువులు పుట్టుకొస్తున్నాయి. అయితే చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని శరవేగంగా విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ భారత్ కోసం ఓ ఐదవ మోడల్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఐదవ మోడల్ కూడా ఎస్‌యూవీనే కావటం. ఇది పెట్రోల్‌తో జిఎస్ (ZS) మోడల్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడల్‌ను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.
ఇంకా మోటార్‌బీమ్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం.. ఎమ్‌జి మోటార్స్ భారతదేశంలో జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ టెస్టింగ్ చేస్తున్నట్లు తెలియజేసింది. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన టెస్టింగ్ వాహనాన్ని గుజరాత్ నెంబర్ ప్లేట్‌తో కంపెనీ పరీక్షిస్తోంది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఇది భారత మార్కెట్లోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే ఇంతక ముందు లీకైన డాక్యుమెంట్ ప్రకారం.. ఎమ్‌జి మోటార్స్ దేశంలో జిఎస్ మోడల్‌ను పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసే అకాశం ఉందని వెల్లడించింది. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అమ్ముడవుతోంది.
ఇందులో 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఒకటి. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్, ఇది గరిష్టంగా 109.4 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ రెండు ఇంజన్లు ఇప్పటికే యూరో- VI ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఇవి మనదేశంలో బిఎస్6 నిబంధనలకు సమానమైన ఉద్గార ప్రమాణం. దీన్ని బట్టి చూస్తుంటే, ఎమ్‌జి మోటార్స్ ఈ రెండు ఇంజన్ ఆప్షన్లను భారత మార్కెట్లో విడుదల చేయటానికి లైన్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి