పల్సర్ పేరు వినగానే కుర్రాళ్ళకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది.. అయితే ఈ పల్సర్ నుంచి ఎన్నో కొత్త మోడల్స్ మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో బండిని మార్కెట్లోకి విడుదల చేసింది.. ఈ బైక్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..పికప్, మంచి ఇంజిన్ ప్రదర్శనతో పాటు మెరుగైన రైడింగ్ అనుభూతినిచ్చే పల్సర్ మోటార్ సైకిళ్లంటే కుర్రకారుకు ఎంతో క్రేజ్. తాజాజ్ బజాజ్ సంస్థ 2021 మోడల్ పల్సర్ 180 మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పాత సెమీ ఫేయిర్డ్ 180 ఏఫ్ మోడల్ స్థానంలో ఈ సరికొత్త బైక్ రీప్లేస్ చేసినట్లు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది.


ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.08 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.సరికొత్త పల్సర్ 180 మోటార్ సైకిల్లో 178.6సీసీ సింగిల్ సిలీండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 8500 ఆర్పీఎం వద్ద 16 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6500 ఆర్పీఎం వద్ద 14.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇది కాకుండా సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ ను కూడా ఇందులో మార్చివేసింది బజాజ్ సంస్థ.. అయితే ఇప్పుడు ఈ బైక్ లోనూ అవే ఫీచర్లు ఉన్నాయి.


బైక్ ప్రత్యేకతలు చూస్తే..మోటార్ సైకిల్లో రెండు వైపులా డిస్క్ బ్రేకులను అమర్చారు. 280ఎంఎం ఫ్రంట్, 230 ఎంఎం రియర్ యూనిట్లను పొందుపరిచారు. అంతేకాకుండా సింగిల్ ఛానెల్ ఏబీఎస్ స్టాండర్డ్ ను మద్దతు ఇచ్చారు. ఈ మోటార్ సైకిల్ ఇంధన ట్యాంకు సామర్థ్యం వచ్చేసి 15 లీటర్లు. అంతేకాకుండా అప్డేట్ చేయడం వల్ల మైలేజీ కూడా పెరిగిందని సంస్థ తెలిపింది. లీటరుకు గరిష్ఠంగా 45 కిలోమీటర్ల మైలేజీనిస్తునందని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ బరువు వచ్చే 145 కేజీలు ఉంటుందని అంటున్నారు.  ఈ బైక్ మార్కెట్ లోకి విడుదల అయిన రెండు రోజులకే భారీ సేల్స్ ను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: