బడ్జెట్ ధరలో బాగా మైలేజ్ ఇచ్చే బైక్ కోరుకునేవారికి మార్కెట్‌లో  బజాజ్, టీవీఎస్, హీరో మోటొకార్ప్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. చాలా మంది కూడా మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం ఈ కంపెనీలకు చెందిన బైక్స్‌నే కొంటూ ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు వీటికి ఉన్న డిమాండ్ వేరే లెవెల్ అని చెప్పాలి. చాలా మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో బజాజ్ సీటీ 110 కూడా ఒకటి. బజాజ్ సీటీ 110 బైక్ అయితే లీటరుకు ఏకంగా 90 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుందని బజాజ్ కంపెనీ పేర్కొంటోంది. ఇక ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ మైలేజ్ అనేది సాధ్యం అవుతుంది. అందుకే కంపెనీ చెప్పే మైలేజ్‌కు మనం రోడ్డు మీద నడిపే వచ్చే మైలేజ్‌కు కొంత  వ్యత్యాసం అనేది కూడా ఉండొచ్చు. లీటరుకు ఈ బైక్ 70 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇస్తుందని వాహనదారులు తెలుపుతూ ఉంటారు. అయితే ఇది ఎక్కువ మైలేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బైక్‌లో 115 సీసీ ఇంజిన్ ఉంటుంది. దీని ధర వచ్చేసి రూ. 61 వేలుగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ధర వర్తిస్తుంది.ఇక ఈ బైక్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే గంటకు 90 కిలోమీటర్లు ఉంటుంది.దీనిని రూ. 2090 నెలవారీ ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు.


బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్లు ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఈ బైక్‌కు ఫుల్ ట్యాంక్ చేస్తే... ఏకంగా 700 కిలోమీటర్లకు పైగా వెళ్తుందట. అంటే చాలా ఈజీగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిపోవచ్చు. అయితే ఇలాంటి కమ్యూటర్ బైక్స్‌పై ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి.మంచిగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కోరుకునే వారికి ఇలాంటి బైక్స్ చాలా అనువుగా ఉంటాయి. బజాజ్ ఆటో గతంలో సీటీ 100 బైక్‌ను అమ్మేది. అయితే ఈ బైక్‌ తయారీని పూర్తిగా ఆపేసింది. బీఎస్ 6 ఇంజిన్‌తో దీని ప్లేసులో సీటీ 110 ఎక్స్ బైక్‌ను తీసుకువచ్చింది. ఇంకా అలాగే ఇందులో మరో వేరియంట్ కూడా ఉంది.అలాగే బజాజ్ సీటీ 125 ఎక్స్ మోడల్ కూడా ఉంది. రెండింటి ధరలో తేడా ఉంటుంది. ఈ మోడల్‌లో ఇంజిన్ పవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని ధర కూడా ఎక్కువే. మొత్తం రూ. 75 వేలుగా ఉంది. ఇక ఈ రెండు బైక్స్ కూడా చూడటానికి ఒకేలా ఉంటాయి. యూఎస్‌బీ పోర్ట్ చార్జింగ్ ఇంకా డీఎల్ఆర్ లైట్స్ అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: