శనగపిండితో చాలా వంటలతో పాటు మన ముఖ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చన్న విషయం మనకు తెలిసిందే. శనగపిండితో రకరకాల ఫేస్ ప్యాక్ లను కూడా తయారు చేసుకుని వాడుతూ ఉంటాం. శనగపిండి మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.  ఈ శనగపిండి కేవలం మన చర్మ సౌందర్యాన్నే కాదు మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.జుట్టు రాలడం, అలాగే జుట్టు సలుచగా ఉండడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారు శనగపిండితో ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.శనగపిండితో హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి? దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి  మనం ఒక ఉల్లిపాయను, 3 టీ స్పూన్ల శనగపిండిని ఇంకా 4 టీ స్పూన్ల పుల్లటి పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా ఉల్లిపాయను మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి 4 టీ స్పూన్ల ఉల్లిరసాన్ని తీసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో పెరుగు, శనగపిండిని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇంకా ఈ మిశ్రమం ఆరిన తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు ఈజీగా వస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లల్లో పేరుకుపోయిన మురికి, దుమ్ము ఇంకా ధూళి వంటివి తొలగిపోయి జుట్టు కుదుళ్లు బలంగా, అలాగే ధృడంగా తయారవుతాయి. అలాగే చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా శనగపిండితో హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వారానికి ఒకసారి అప్లై వల్ల జుట్టును అందంగా, ఒత్తుగా ఇంకా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: