ఏపీలో న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, పుర‌పాల‌క సంఘాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. అన్నిచోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న జోరు చూపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువడిన ఫ‌లితాల్లో వైసీపీ ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో ఉంది. అయితే ఆ పార్టీకి అనుకోని ఓట‌మి ఎదురైంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల పుర‌పాల‌క సంఘానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున ఛైర్ ప‌ర్స‌న్ అభ్య‌ర్థిగా పోటీచేసిన మ‌హాల‌క్ష్మి ఓట‌మిపాల‌య్యారు. అలాగే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు పుర‌పాల‌క సంఘాన్ని వైసీపీ కైవ‌సం చేసుకుంది. 23 వార్డుల‌కుగాను ఆ పార్టీ 15 చోట్ల‌, టీడీపీ 7 చోట్ల‌, బీజేపీ ఒక వార్డులో విజ‌యం సాధించాయి. ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి న‌గ‌ర పంచాయితీని కూడా వైసీపీ కైవ‌సం చేసుకుంది. మొత్తం 20 వార్డుల‌కు గాను ఆ పార్టీ అభ్య‌ర్థులు 18 వార్డుల్లో విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. టీడీపీ రెండు వార్డులను గెలుచుకోగ‌లిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: