
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇరుగు పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఉప్పు, నిప్పులా వ్యవహరించాడు. తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ వాళ్లు ఎవరికీ అడ్రస్‌లు లేవని, చివరికి మోడీ, అమిత్‌షాలు కూడ తనకంటే జూనియర్లు అని హేళన చేసాడని వివరించారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత సుహృద్భావ వాతావరణాన్ని నెలకొలిపారని గుర్తు చేసారు. అదేవిధంగా భారత మొదటి విద్యాశాఖ మంత్రిగా దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని, ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించారు ఎంపీ విజయసాయిరెడ్డి.