ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై, మోదీ పై విమర్శలు చేశారు. కాశ్మీర్‌ అంశాన్ని సరిదిద్దే శక్తి భారతీయ జనతా పార్టీకి లేదని విమర్శించారు. ఇటీవల అక్కడ వరుసగా కాశ్మీర్ పండిట్ల హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరుస సంఘటనల కారణంగా కాశ్మీరీ పండిట్లు అక్కడ నుంచి బలవంతంగా తరలిపోతున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు.


కాశ్మీరీ పండిట్లను ఆపేందుకు కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో బయట పెట్టాలని కేజ్రీవాల్‌ సవాల్ విసిరారు. కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు పెరిగేందుకు పాకిస్థాన్‌ మద్దతు ఇస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేననంటున్న కేజ్రీవాల్.. కాశ్మీర్‌పై రాజకీయం చేయొద్దని పాకిస్తాన్‌కు చెప్పదల్చుకున్నామన్నారు. కాశ్మీర్‌ పండిట్ల డిమాండ్లను నెరవేర్చాలని..  వారికి భద్రత కల్పించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: