తిరుమలలో తన పట్ల టీటీడీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని, దర్శనానికి రూ. 10 వేలు డిమాండ్ చేశారని హీరోయిన్‌ అర్చనా గౌతమ్‌ చేసిన రచ్చపై టీటీడీ స్పందించింది. అర్చనా గౌతమ్‌ తమ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించి.. మళ్లీ  టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కార్యాల‌య సిబ్బంది త‌న‌పై చేయి చేసుకుని దురుసుగా ప్రవ‌ర్తించార‌ని త‌ప్పుడు ఫిర్యాదు చేశారని టీటీడీ వివరణ ఇచ్చింది. అడిషనల్ ఈవో కార్యాల‌య సిబ్బందిని పోలీసులు పిలిపించి విచారించారని.. సిబ్బంది తాము తీసిన వీడియోను సిఐకి చూపించారని టీటీడీ చెబుతోంది.


ఆ వీడియోలో న‌టి దురుసుగా ప్రవ‌ర్తించిన విషయం పోలీసులకు అర్థమైందని.. తన విషయం ఆ వీడియో ద్వారా తెలియడంతో న‌టి అర్చనా గౌతమ్‌ కూడా వెన‌క్కి త‌గ్గి అక్కడి నుంచి వెళ్లిపోయారట. సెప్టెంబరు  1వ తేదీకి విఐపి బ్రేక్ ద‌ర్శనం టికెట్ కావాలంటే రూ.10,500/- చెల్లించి టికెట్ పొందొచ్చని మాత్రమే టీటీడీ సిబ్బంది స‌ల‌హా ఇచ్చారట. వాస్తవాలు ఇలా ఉంటే సిబ్బంది రూ.10 వేలు డిమాండ్ చేశార‌ని వీడియోలో న‌టి అర్చనా గౌతమ్ ఆరోపించారని... తాను సెల‌బ్రిటీ అయినందువ‌ల్ల ఏమి చెప్పినా భ‌క్తులు న‌మ్ముతార‌నే అభిప్రాయంతో ఆమె సోష‌ల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని టీటీడీ వివరణ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd