ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటన పై  ఆ పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాళ్లదాడి ఘటన పై ఇప్పటికే నందిగామ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు  సీఎస్ఓ మధుబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు నామమాత్రపు బెయిల్ బుల్  కేసు నమోదు చేశారని వారు విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుల ఫోటోలు సైతం తెలుగు దేశం విడుదల చేసింది.


చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడంపై టీడీపీ  నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం గవర్నర్ కలవనున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఈనెల 4వ తేదీ రాత్రి పట్టణంలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో రాయి తగిలి బాబు సీఎస్‌వో గాయాలయ్యాయి . చంద్రబాబు త్రుటిలో దాడి నుంచి తప్పించుకోగలిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: