తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కున్నప్పుడు ఆర్ అండ్‌ ఆర్  ప్యాకేజీ ఎందుకివ్వడంలేదని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు 15లక్షల చాలవా అని మంత్రి హరీష్‌రావు మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు.


అలాగైతే కేసీఆర్ ఫాంహౌస్‌కి ఎకరానికి 15లక్షలు మేము ఇస్తామని కేసీఆర్ భూములు ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సవాల్ చేశారు. ఆ భూమిని ప్రాజెక్టు నిర్వాసితులకు పంచుతామని రాణి రుద్రమ పేర్కొన్నారు. కామారెడ్డిలో యువ రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ  ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021వరకు దాదాపు 6వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ వివరించారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లో చెలామణి అవుతుంటే సీఎం చేతులు ముడుచుకొని కూర్చున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: