మనం ప్రతిరోజు తలస్నానం చేయడానికి ఎక్కువగా షాంపోలు వాడుతుంటాం. అయితే ఈ షాంపోలు రక రకాల కంపెనీ వారు తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్క కంపెనీ తమ షాంపో బెస్టంటే తమ షాంపో బెస్ట్ అని చెబుతుంటారు. ముఖ్యంగా తలలో పేరుకు పోయిన చుండ్రును నివారించేందుకు చాలా మంది రక రకాలు ట్రీట్ మెంట్స్, షాంపోలు వాడుతుంటారు. అయితే ప్రాచీణ కాలంలో ఎలాంటి షాంపోలు గాని ఇతరత్ర మెడిసెన్స్ కానీ ఉండేవి కావు. ప్రకృతిలో లభించే ఔషదాలతో తల స్నానం చేసేవారు. ఆ కాలంలో  మహిళలకు కేశాలు ఎంతో ఆరోగ్యవంతంగా పటిష్టంగా వత్తుగా ఉండేవి.


ఈ మద్య కాలంలో పొడవాటి, ఒత్తైన, సీల్కీ హెయిర్ మీకు అందిస్తుంది అంటూ రకరకాల ప్రొడక్ట్స్ కళ్ల ముందు చూపిస్తుంటే.. ప్రతి ఒక్కరూ ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు.  కొన్ని షాంపూలో హానికారక రసాయనాలు ఉంటాయని మీ మమ్మీ మీకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తోందా ? కానీ టీవీలో వచ్చే యాడ్స్ అందరినీ టెంప్ట్ చేస్తున్నాయి. ప్రకృతి వరదాయని షికాయి..దీన్ని చూర్ణం చేసుకొని తలకు పట్టించి స్నానం చేస్తే చుట్టు మృదువుగా ఉండటమే కాకుండా నిగ నిగలాడుతూ ఆరోగ్యవంతంగా ఉంటుంది. 


షికాయి వల్ల లాభాలు :

షీకాకాయ హెర్బల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ఫ్ నివారించవచ్చు. అలాగే చిట్లిపోతున్న జుట్టుని కూడా అరికట్టవచ్చు. జుట్టుని స్మూత్ అండ్ సాఫ్ట్ గా మార్చేస్తుంది. 
చుండ్రు నివారించడానికి షీకాకాయ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, న్యూట్రీషనల్ గుణాలు.. చుండ్రుని తగ్గించడంతో పాటు, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. చుండ్రు నివారించవచ్చు.  
వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు, స్పాట్స్, తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటాయి. షీకాకాయ ఉపయోగించడం వల్ల నల్లటి ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చు. షీకాకాయ, ఉసిరి వంటి వాటితో.. హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడటం వల్ల తెల్లజుట్టుని నివారించవచ్చు.  
జుట్టు రాలే సమస్య కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల షీకాకాయ జుట్టు రాలడాన్ని అరికట్టి.. వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: