అందమైన ముఖం అనగానే ముందుగా గుర్తొచ్చేది పెదవులే. పెదవుల అందం ముఖానికి మరింత వన్నె తెస్తుంది. పొడిబారిన పెదవులు ఉన్నా లేక పగుళ్ళు ఏర్పడుతున్నా ముఖం కూడా అందవిహీనంగా కనపడుతుంది. అందుకే పెదవులని ఎప్పటికప్పుడు తెమాగా ఉండేలా చూసుకోవాలి. అయితే చాలా మంది ఎదుర్కునే సమస్య ఏమిటంటే. పెదవులు పగిలిపోతూ, పొడిబారడం. ఈ సమస్య ఎంతోమందిని వేధిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ రకమైన ఇబ్బందులని ఎంతో మంది ఎదుర్కుంటున్నారు. మరి పెదాలు సహజంగా, ఎప్పుడూ తేమగా ఉండాలంటే మనం ఏమి చేయాలి.

 Image result for drink water for lips

పెదాలు తేమగా, మెరుస్తూ ఉండాలంటే, పడుకునే ముందు ఆముదం లేదా నిమ్మరసం రాసుకుని పడుకుంటే ఉదయం లేవగానే ముఖం శుభ్రం చేసుకునే పెదవులు తేమని ఆవరించి ఉంటాయి. ఇలా రోజూ చేసుకోవచ్చు. అంతేకాదు విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు  అధికంగా తీసుకోవాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పెదవులు తేమగా ఉంటాయి.

 Image result for drink water for lips

వాతావరణంలో ఒక్క సారిగా మార్పులు సంభవించినప్పుడు కూడా పెదవులలో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో పెదవులకి కొబ్బరి నూనె, నెయ్యి లాంటి మిశ్రమాలు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తయితే రోజుకి సుమారు 12 గ్లాసుల నీళ్ళు త్రాగడం వలన కూడా పెదవులు లేతగా, తేమగా మారుతాయి,కానీ ప్రస్తుత కాలంలో రోజుకి కనీసం ఒక్క లీటరు నీటిని కూడా తీసుకోలేక పోతున్నారు, అది అశ్రద్ద వలన కానీ పని ఒత్తిడి వలన అయినా అవ్వచ్చు కానీ నీటిని తీసుకోక పోవడంతో ఎన్నో అనర్ధాలు కూడా జరుగుతాయి. అందుకే తప్పకుండా రోజుకి కనీసం  4 లీటర్ల నీటిని తీసుకునే అండంతో పాటు ఆరోగ్యం కూడా సొంతం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: