అలాంటి ఈమె తొలిసారి ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ఇక వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనపై వచ్చిన ఎఫైర్ రూమర్స్ గురించి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ లో తాజాగా ఈమె అగ్లీ స్టోరీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనపై వచ్చిన ఎఫైర్ రూమర్స్ గురించి స్పందించింది.
అవికా గోర్ మాట్లాడుతూ.. నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నేను 32 ఏళ్ల నటుడితో ఎఫైర్ పెట్టుకున్నాను అనే రూమర్ స్ప్రెడ్ చేశారు. 32 ఏళ్ల నటుడితో ఎఫైర్ ఉందని, సీక్రెట్ గా అతడిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నానని ఒక రూమర్ రాశారు .అయితే ఈ రూమర్ కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ..నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా రాసేవారు చాలా క్రియేటివ్ గా ఆలోచించారు. ఇలా రాసేవారు సినిమాలు కూడా చేయొచ్చు కదా అంటూ సూచించింది అవికా గోర్ .. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అవికా గోర్ తనపై రూమర్స్ వచ్చినా.. వాటిని పాజిటివ్గా తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి