చర్మం.. ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉండగలం. చర్మం రంగు ఎలాంటిది అయినా సరే.. అది ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలంలో పొల్యూషన్, దుమ్ముకి ఎంత ఆరోగ్యమైన ఆహారాన్ని తిన్న సరే ఈ దుమ్ము, దూళి వల్ల చర్మ సమస్యలు వస్తాయి.. అలానే చర్మ రంగుకూడా మారుతుంది. 


ఇంకా చెప్పాలంటే ముఖం రంగు కూడా మారుతుంది. ఎండ, దుమ్ము, ధూళి అన్ని కలిసి రంగు మార్చేస్తాయి. అయితే అలాంటి సమస్య ఉన్న వారు ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోండి. 
శనగ పిండిలో పసుపు, రోజ్ వాటర్, పాలు, కలబంద(అలోవేరా) గుజ్జు కలిపి ముద్దలాగా చేసుకొని ముఖానికి పట్టించాలి. ఆ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత నీటితో కడగాలి. ఈ మిశ్రమం వల్ల చర్మం శుభ్రపడి కాంతివంతంగా మారుతుంది. 


తల మీద కురుపులు, పుండ్లు అవుతే చెంచా వేపనూనె, 10 గ్రాముల కర్పూరం కలిపి మాడుకు పట్టిస్తే పేలు నశించటమే గాక పుండ్లు, కురుపులు పూర్తిగా తగ్గిపోతాయి.


గజ్జి ఉంటె వేపాకు, పసుపు, చెంచా ఉప్పు దంచి ముద్దజేసి గజ్జి కురుపుల మీద రుద్ది గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు క్రమంగా తగ్గుతాయి.


కస్తూరి పసుపు, నువ్వుల నూనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గి చర్మం అందంగా తయారవుతుంది.


నిమ్మ రసం, పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమల మచ్చలు పోతాయి.


అరటిపండు గుజ్జు, వెన్న పేస్ట్ ల కలిపి ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసుకుంటే చర్మానికి తేమ అంది చర్మం పొడి బారదు.


ఉడికించిన బంగాళాదుంప, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే నల్లబడ్డ చర్మం అసలు రంగులోకి వస్తుంది. 


తేనె, రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం సున్నితంగా మారుతుంది.


క్యారెట్‌ గుజ్జు 2 చెంచాలు, తేనె కలిపి ముఖానికి రాస్తే పొడి చర్మానికి సాంత్వన లభించటమే గాక నల్లబడ్డ చర్మం కూడా మెరిసిపోతుంది. 


తేనె, పెరుగు కలిపి ముఖానికి, మెడకు ప్యాక్‌ వేసి పావుగంట తరువాత చన్నీటితో కడిగితే పొడిబారిన చర్మం మెత్తబడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: