తాము అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. ముఖ్యంగా.. అమ్మాయి అందంగా క‌నిపించ‌డానికి చేసే సాధ‌న‌లు అన్నీ ఇన్నీకావు. ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్క్ లు, క్రీములు వగైరా వగైరా ఉపయోగిస్తూ ఉంటారు. మ‌రియు వేలు ఖర్చుపెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ, అది తాత్కాలిక అందాన్ని మాత్ర‌మే అందిస్తుంది. వాస్త‌వానికి అందంగా కనిపించాలంటే అది చర్మం మీద ఆధారపడి ఉంటుంది. సరియైన ఆరోగ్య నియామాలు పాటించకపోవడం వల్ల చర్మం నిగారింపు లేక కళతప్పి కనిపిస్తుంది. అయితే చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌నిపించాలంటే.. పోష‌ల ఆహారంతో పాటు ఇప్పుడు చెప్పుబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే మంచి ఫ‌లితం పొంద‌వ‌చ్చు.

 

ప్ర‌తి రోజు మార్నింగ్‌ లేచిన తర్వాత కాసేపటికి ఫేస్‌ను శుభ్రంగా చ‌ల్ల‌టి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నైటంతా ముఖంపై పేరుకుపోయిన జిడ్డు తొల‌గుతుంది. అలాగే ముఖంపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా పోవ‌డంతో పాటు ముఖానికి కావాల్సిన రక్తప్రసరణ అందుతుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్ కూడా మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. ప్ర‌తిరోజూ మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఆరెంజ్‌, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు తీసుకోవాలి. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్ సీ, ఈ అందుతాయి. ఇది మీ చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డ‌మే కాకుండా అందంగా క‌నిపించేలా కూడా చేస్తుంది. 

 

ఇక మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు మేకప్ మొత్తం తీసి.. ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో వాష్ చేసుకుని పడుకోండి. ఎందుకంటే మేక‌ప్ వేసుకునేట‌ప్పుడు చాలా మంది ఏవేవో ఎఫెక్టీవ్ క్రీమ్స్ రాసుకుంటారు. వాటిని కడుక్కోకుండా అలాగే పడుకుంటే మీ చర్మ రంధ్రాలు మొత్తం మూసుకుపోయి చర్మానికి కావాల్సినంత గాలి అంద‌కుండా చేస్తుంది. అలా క్ర‌మంలోనే చ‌ర్మంపూ మొటిమ‌లు ఇత‌రిత‌ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డి అంద‌హీనంగా త‌యార‌వుతుంది. అలాగే చాలామంది ఉదయాన్నే టోనర్ ఉపయోగించరు. అయితే కచ్చితంగా టోనర్ ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది.  
 
 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: