ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి... చాలా మంది కాలి పగుళ్లతో బాధపడుతూ వుంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ సమస్యతో ఎక్కువ సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ చిన్న చిన్న ఇంటి చిట్కాలతోనే మీకున్న ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు....

వేడి నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి పాదాలు పది నిమిషాలు సోక్ చేయండి. మీ పాదాలకి ఉన్న పగుళ్ళు మరీ డీప్ గా ఉంటే ముందు వాటికి కొంచెం నువ్వుల నూనె పట్టించి అప్పుడు సోక్ చేయండి.

వేడి నీటిలో అర కప్పు ఎప్సం సాల్ట్ వేసి పది నిమిషాలు సోక్ చేసి అప్పుడు ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయండి.

రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో ఒక టీ స్పూన్ తేనె, మూడు నాలుగు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసి పేస్ట్ లా చేయండి. మీ పాదాలు మరీ డ్రై గా ఉంటే ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కానీ కూడా కలుపుకోవచ్చు. వేడి నీటిలో పదినిమిషాలు పాదాలను సోక్ చేసిన తరువాత ఈ పేస్ట్ తో స్క్రబ్ చేయండి.

ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ తీసుకోండి. ఇందులో ఐదారు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. వేడి నీటిలో పాదాలను సోక్ చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకి పట్టించి సాక్స్ వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. టీ ట్రీ ఆయిల్ ని డైరెక్ట్ గా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి.

ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి లో నాలుగైదు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. ఈ పేస్ట్ ని పాదాలకి పట్టించి అర గంట పాటూ అలా వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్ట తో అద్దండి.

ఇలాంటి మరెన్నో బ్యూటీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మరింత సమాచారం తెలుసుకోండి: