ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అది ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరానికి శక్తిని అందించినట్లే.. సౌందర్య సాధనంగా కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్లూ, విటమిన్-A, విటమిన్-C, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. మీ ముఖం మెరవాలంటే ఇలా చేయండి.

ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపండి. అనంతరం దాన్ని ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకోండి. తప్పకుండా మీ ముఖం మీద మొటిమలు తగ్గుతాయి.ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చాలు ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.క్యారెట్‌ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మీద మడతలు మాయమవుతాయి. 4 స్పూన్ల క్యారెట్ జ్యూస్‌లో 2 స్పూన్ల బొప్పాయి జ్యూస్, అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు ముఖం కాంతివంతంగా మారుతుంది.ఇక అలాగే క్యారెట్ జ్యూస్ ని టమాటా గుజ్జులో బాగా కలిపి ముఖానికి అలాగే మెడకి బాగా పట్టించండి అలా చెయ్యడంలో మోటాలు మచ్చలు తగ్గి ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది..ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే మీకు చక్కటి ఫలితాలు లభిస్తాయి.. ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: