ఒత్తయిన ఆరోగ్యకరమైన ఇంకా పొడవైన జుట్టు కోసం మీరు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అయితే అలా ప్రయత్నాలు చేసి డబ్బులు పెట్టక్కరలేదు. కొన్ని ఇంటి చిట్కాలతో కూడా జుట్టు రాలే సమస్యనే కాకుండా ఇంకా ఇతర జుట్టు సమస్యలని కూడా ఎంతో సహజంగా తగ్గించుకోవచ్చు.అలాంటి చక్కటి ఇంటి చిట్కాలలో ఒకటి ఉసిరి కాయ వాడటం. ఉసిరిలో ఉన్న ఎన్నో గుణాలు చర్మానికీ అలాగే జుట్టుకి ఎంతో సహాయం చేస్తాయి. స్కాల్ప్ హెల్త్ ని ప్రమోట్ చేస్తాయి, జుట్టుకి కావాల్సిన పోషణని అందిస్తాయి, చుండ్రుని తగ్గిస్తాయి కూడా. ఇక ఈ ఉసిరితో వచ్చే పొడి సులభంగా లభిస్తుంది కూడా. ఇక్కడ ఈ ఉసిరి పొడిని ఎలా వాడాలో కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి.


ఉసిరి పొడి, పెరుగు జుట్టుకి చాలా మంచివి.ఇక ఇవి జుట్టుకి మంచి పోషణ ఇస్తాయి., డ్రై స్కాల్ప్ సమస్య ఏర్పడకుండా చేస్తాయి. ఇక పెరుగుని స్కాల్ప్ మీద అప్లై చేయడం వల్ల చుండ్రు కూడా కంట్రోల్ అవుతుంది. ఉసిరి పొడిని పెరుగుతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయండి. ఈ మాస్క్‌ని మీ జుట్టికీ స్కాల్ప్‌కి అప్లై చేసి కొంత సేపటి తరువాత హెయిర్ వాష్ చేసుకోండి.చక్కటి ఫలితం తప్పకుండా ఉంటుంది.ఇక జుట్టు ఒత్తుగా ఎంతో ఆరోగ్యంగా పెరగడం కోసం మెంతులు వాడడం చాలా మంచిది.మెంతులు వలన జుట్టుకి మంచి ప్రయోజనాలు వున్నాయి.ఇవి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి హెయిర్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. రాత్రంతా మెంతుల్ని నీటిలో నానబెట్టండి. వీటిని బ్లెండ్ చేసి పేస్ట్ లా చేయండి. అవసరమనుకుంటే కొద్దిగా నీరు కలపండి. ఈ పేస్ట్‌కి ఉసిరిపొడి కలపండి. ఈ మాస్క్‌ని జుట్టుకీ స్కాల్ప్‌కి అప్లై చేసి ఆ తరువాత హెయిర్ వాష్ చేసుకోండి.ఒత్తయిన ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: