పూర్వం కాలంలో వయసు మళ్ళితే గాని తెల్లబడని జుట్టు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు జుట్టు తెగ తెల్లబడుతూ ఉంది.దీనికి కారణం వంశపారంపర్యం,హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్,పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటి వాటి వల్ల జుట్టు తెల్లబడుతూ ఉంటుంది.దీనిని ఎంగేజ్ లో ఉన్నవారు దాయలేక రకరకాల కెమికల్ డయల్ వాడుతూ ఉంటారు.దీనివల్ల జుట్టు అప్పటికప్పుడు నల్లబడినా సరే ఆ తరువాత తెల్లబడటమే కాకుండా ఇతర చర్మ సమస్యలను కూడా కలిగిస్తూ ఉంటాయి.అలా కాకుండా ఇంట్లో దొరికే ఆవనూనెతో కొన్ని రకాలు పదార్థాలను కలిపి డైగా వాడడం వల్ల వెంటనే నల్లబడుతుంది.మరియు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు కూడా. మరి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి..

ఈ చిట్కా కోసం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవనూనె తీసుకొని,కడాయిలో వేసుకోవాలి.ఆ తర్వాత ఐదు నుంచి ఆరు వరకు మందారమాకులు,గుప్పెడు కరివేపాకును,రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బాగా వేయించుకోవాలి.ఇలా ఇది బాగా రంగు మారిన తర్వాత దింపి చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించే ముందు జుట్టును బాగా దువ్వి చిక్కులు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టును పాయలు పాయలుగా తీసి జుట్టుకు అప్లై చేసుకోవాలి.ఇలా అప్లై చేసిన తర్వాత  అరగంట నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాతషాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది.ఎక్కువ గ్రే హెయిర్ తో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది.

చిన్నపిల్లలకు కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువ హాని కలిగిస్తాయి కనుక ఇలా నేచురల్ పదార్థాలతో తయారుచేసిన చిట్కాలే చాలా బాగా ఉపయోగపడతాయి.కావున గ్రై హెయర్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా తప్పక పాటించి చూడండి.మరియు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం,సరైనఆహారం తీసుకోవడం,సరైన జీవనశైలి పాటించడం వాటి వల్ల కూడా తొందరగా గ్రే హెయర్ రాకుండా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: