ఏప్రిల్ 7 వ తేదీన  ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ  రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి . 

 

 

 గడియారం వెంకట శేషశాస్త్రి జననం  : ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగిలించేలా  రచనలు రచించిన గొప్ప వ్యక్తి గడియారం వేంకటశేషశాస్త్రి. ఈయన 1894 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. పరాయి పాలనలో  భారతమాత నలిగిపోతున్న తరుణంలో పరాయి పాలన తరిమికొట్టేందుకు తిరుగుబాటును రేకెత్తించేందుకు... స్వాతంత్రోద్యమ కాంక్షను రగిల్చేందుకు ఈయన రచించిన గొప్ప కావ్యం  శ్రీ శివభారతం.ఈయన  రచించిన  ఈ కావ్యం  ఎంతగానో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చింది. స్వాతంత్రోద్యమ కాంక్షను కలిగించింది. ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగిల్చేందుకు ఎన్నో కావ్యాలను రచించి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు గడియారం శ్రీ వేంకట శేషశాస్త్రి. 

 

 

 రవిశంకర్ పండిట్ జననం  : 1920 ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన సితార్ విద్వాంసుడు రవి శంకర్  పండిట్. సితార్ విద్వాంసుడు గా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సితార్ సంగీతంలో ఎన్నో ప్రయోగాలు ప్రదర్శనలు చేసి ఎంతగానో  గుర్తింపు సంపాదించారు. వారణాసికి చెందిన ఈయన సాంస్కృతిక కళా సంగీతంలో ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. అంతేకాకుండా సితార్  ద్వారా ఎన్నో ప్రదర్శనలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పండిట్ రవిశంకర్. 

 

 

 జితేంద్ర జననం : భారత చలనచిత్ర ప్రముఖ నటుడు జితేంద్ర 1942 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించారు . అంతేకాకుండా వివిధ భాషల్లో కూడా వైవిద్యాత్మక పాత్రల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. వైవిద్యాత్మక పాత్రల్లో  తనదైన నటనతో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జితేంద్ర. 

 

 

 రాంగోపాల్ వర్మ జననం : రామ్ గోపాల్ వర్మ  తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఎన్నో సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. ఎన్నో వివాదాస్పద సినిమాలను తెరకెక్కించే తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ సృష్టించారు  రాంగోపాల్ వర్మ. ఇక వర్మ తీసే సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. తనదైన టేకింగ్ తో వర్మ సినిమాలను తెరకెక్కిస్తూ  ఉంటారు. వర్మ సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఎప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: