కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న మురుగదాస్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్ కూడా. ప్రధానంగా సామాజిక అంశాలకు యాక్షన్ ను జోడించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రత్యేక శైలి ఆయనది. తమిళనాట వరుసగా స్టార్ హీరోలు అజిత్ కుమార్, సూర్య హీరోలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా స్టేటస్ అందుకున్నాడు. ఈ అగ్ర దర్శకుడి పుట్టిన రోజు నేడు.

మురుగదాస్ స్వస్థలం తమిళనాడులోని తిరుచ్చి. 1974 సెప్టెంబర్ 25న మురుగదాస్ జన్మించాడు. ఆయన అసలు పేరు మురుగదాస్. కానీ మొదటి సినిమా చేస్తున్నప్పుడు తన తండ్రి పేరు కలిసి వచ్చేలా ఏఆర్ అనే అక్షరాలను చేర్చుకున్నారు. తిరుచ్చి లోని బిషప్ హెబర్ కాలేజీలో బి.ఏ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే తమిళ సినిమాలు అంటే ఆయనకు ఆసక్తి ఏర్పడింది. అప్పట్లోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు మురుగదాస్. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులను అనుకరిస్తూ స్టేజ్ షోలు ప్రదర్శించేవాడు. ఆయన టాలెంట్ కు కాలేజీ రోజుల్లోనే ప్రశంసలు కురిసేవి. కాలేజీ తర్వాత మురగదాస్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఆయనకు తిరస్కరణ ఎదురయ్యింది.

ఆ తర్వాత పి. కలైమణికి సహాయ రచయితగా చేరాడు. తమిళ చిత్రం 'మధుర మీనాక్షి'కి సంభాషణలు రాసింది మురుగదాసే. ఆ తర్వాత 1997 లో వచ్చిన 'రచ్చగాన్' చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడు. తెలుగు మూవీ 'కలుసుకుందాం రా'కు అసిస్టెంట్ స్క్రిప్ట్ డైరెక్టర్ గా చేశాడు. 2003లో ఓ ప్రాజెక్ట్ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఎస్.జె.సూర్య తొలిచిత్రం 'ధీనా'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మురుగదాస్. అదే ఆయన మొదటి చిత్రం కాగా ఈ సినిమాకు మురుగదాస్ ను దర్శకుడిగా అజిత్ సిఫార్సు చేశాడు. అలా మొదటి చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత రమణా, గజిని, స్టాలిన్ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ రేస్ లో చేరిపోయాడు మురుగదాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: