తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌, ఆయ‌న కుమారుడు, మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఇటు కుటుంబానికి చ‌క్క‌టి టైం కేటాయిస్తూ ఉంటారు. అలాగే కేటీఆర్‌, క‌విత ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇక క‌రోనా వేళ తెలంగాణ‌లో కేసులు ఎంత పెరుగుతున్నా కేసీఆర్ ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటోంది. కేటీఆర్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి కోస ప్ర‌భుత్వం తీసుకుంటోన్న చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షిస్తుండ‌డంతో పాటు అటు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌కు క‌రోనా సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చేస్తున్నారు.

 

కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌ల ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చిన్న స‌మ‌స్య‌కు కూడా ప‌రిష్కారం చూపించే వ‌ర‌కు నిద్ర‌పోరు. తాజాగా కేటీఆర్ ట్వీట్ట‌ర్లో టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ స్వీయనిర్బంధంలో ఉన్న వేళ త‌న భార్య అనుష్క శ‌ర్మ‌తో త‌న హెయిర్‌ను స్టైల్‌గా చేయించుకున్నాడు. అనుష్క శ‌ర్మ కోహ్లీ హెయిర్‌ను చాలా అందంగా మ‌లిచింది.... ఈ విధంగా మీరు ఎందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌ద‌ని ప్ర‌శ్న వేశారు. 

 

అంటే మీరు కూడా మీ భార్య‌ల‌కు ఆ ఛాన్స్ ఇవ్వ‌వ‌చ్చు క‌దా ? అని కేటీఆర్ ప్ర‌శ్న అర్థం. అయితే ఈ ట్వీట్‌కు సోద‌రి క‌విత రిప్లే ఇస్తూ అన్న‌య్యా బాబీకి కూడా (అంటే కేటీఆర్ భార్య షాలిమా ముద్దు పేరు) ఛాన్స్ ఇస్తున్నావా ? అని స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తూ రిప్లే ఇచ్చారు. సో క‌విత లెక్క ప్ర‌కారం ఇప్పుడు కేటీఆర్‌కు ఆయ‌న స‌తీమ‌ణి బాబీ మంచి హెయిర్ స్టైల్ చేయాల‌న్న‌మాట‌. ఏదేమైనా కేటీఆర్‌, క‌విత స‌ర‌దా ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: