దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దెశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలువుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో సైతం కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేవలం 3 కేసులే నమోదైనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా లాక్ డౌన్ వల్ల పురిటినొప్పులతో బాధ పడుతున్న గర్భినిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆమె కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. కొత్తూరు మండలం దిగువరాయిగూడ గ్రామానికి చెందిన వాణిశ్రీ అనే మహిళకు ఈరోజు ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు, ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్త ఆమెను గ్రామ సరిహద్దు వరకు ఆటోలో తీసుకొని వచ్చారు. కానీ అక్కడ రోడ్డును తవ్వడం ఆమెను డోలి సహాయంతో కొంతదూరం ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
అక్కడి నుండి 108 ఆంబులెన్స్ లో మహిళను కొత్తూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆమెను డోలి సహాయంతో రోడ్డు దాటించాల్సి వచ్చింది. మహిళను రోడ్డు దాటించే క్రమంలో ఆమె నరకయాతన అనుభవించిందని.... ప్రసవ వేదనతో తల్లడిల్లిందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి