క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ స‌ర్కార్ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది.  వైర‌స్ మ‌హ‌మ్మారిని రాష్ట్రం నుంచి త‌రిమికొట్టేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. లాక్‌డౌన్ ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించారు. మ‌రో ప‌క్క రాష్ట్రంలోని తొమ్మిది ల్యాబ్‌ల‌లో క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఒక్క రోజులోనే 6,517 టెస్ట్‌లు నిర్వ‌హిస్తున్నారు. అంతేగాక‌ రాష్ట్రంలోని ప్ర‌తి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేకంగా టోల్ ఫ్రీ నంబ‌ర్ల‌ను కేటాయిస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో టోల్ ఫ్రీ నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

 

అస‌లే లాక్‌డౌన్, ఆపై వేసవి కాలం... దీంతో ప్ర‌జ‌లంతా గ‌డ‌ప దాటి కాలు బ‌య‌ట‌పెట్టని ప‌రిస్థితి. ఉద‌యం నుంచి రాత్రి దాకా ఇంటికే ప‌రిమితం అ వుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. అదే స‌మ‌యంలో క‌రెంట్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌లిగే అవ‌కాశం ఉంది. దీంతో అప్ర ‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం టోల్‌ఫ్రీ నంబ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చింది.  క‌రంట్ కోత‌ల‌కు సంబంధించి 1912 నంబ‌ర్‌ను ప్ర‌భుత్వం కొత్త‌గా ప్రారంభించింది. రాష్ట్రంలో ఎక్క‌డైనా స‌రే.. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌లిగితే వెంట‌నే ఈ నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: