తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో నిన్న 107 కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు 117 కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో 100కు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2256కు చేరింది. 
 
రాష్ట్రంలోని 66 మందికి కరోనా సోకగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన 49 మంది కరోనా భారీన పడ్డారు. వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 844 యాక్టివ్ కేసులు ఉండగా 1345 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఈరోజు నలుగురు కరోనా భారీన పడి మృతి చెందటంతో మృతుల సంఖ్య 67కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: