ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లేందుకు హైకోర్టుకు వెళ్లైందుకు పిటిషన్ దాఖలు చేశామని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారని.... హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే 2 నెలల కాల వ్యవధి ఉంటుందని... అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరతామని అన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే అధికారం లేదంటే నిమ్మగడ్డ నిమాయకం కూడా చెల్లదని తెలిపారు. కనగరాజ్ నియామకం తప్పైతే నిమ్మగడ్డ నియామకం తప్పని అన్నారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే అప్పటి సీఎం చంద్రబాబు సలహా కూడా చెల్లదని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: