దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రీపగలు కరోనా రోగుల కోసం శ్రమించే వైద్యులు సైతం కరోనా భారీన పడుతున్నారు. చెన్నై రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనా బాధిత రోగులకు చికిత్స అందిస్తున్న 33 మంది డాక్టర్లు వైరస్ భారీన పడ్డారు. 
 
చెన్నైలోని సచివాలయంలో 138 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. చెన్నై నగరంలో 28,924 మందికి కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నగరంలోని నాలుగు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు కరోనా లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ట్రైనీ డాక్టర్లు, సహాయకులు వైరస్‌ భారీన పడుతుండటంతో ఆస్పత్రి నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: