ఈ రోజు నంద్యాల పట్టణం శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీ లోపల అమ్మోనియా గ్యాస్ లీక్ అయి అందులో పని చేస్తున్న 50 సం.ల ఒక ఉద్యోగి మృతి ఒకరు మృతి చెందారు. 
ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. 
బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదు..ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దు..అన్ని సేఫ్టీ చర్యలను అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, వైద్య శాఖ అధికారుల ద్వారా యుద్ధప్రాతిపదికన చేపట్టం చేశామని అన్నారు. 

విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి అత్యవసర శాఖల అధికారులను యుద్ధప్రాతిపదికన రంగంలోకి దింపి సేఫ్టీ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 
సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయానా పరిశీలిస్తున్న కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు, తదితర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి