తెలంగాణ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో  విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని  తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఉదయం కాలేజీకి వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నం వెళ్లిపోతున్నారని తద్వారా ప్రభుత్వ కళాశాలల్లో డ్రాపవుట్స్  పెరిగిపోతున్నాయి అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ఇలాంటి పరిస్థితిని నివారించడంతో పాటు ఇంటర్ డిగ్రీ విద్యార్థులందరికీ మధ్యాహ్నం  పౌష్టికాహాడం అందివ్వాలనే  లక్ష్యంతో కాలేజీలో మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

 

 అయితే జడ్చర్ల డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేస్తున్న రఘురాం తన సొంత ఖర్చుతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారనే  విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో  మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కేసిఆర్  అలోచించి... అటు వెంటనే ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: