ఇటీవల టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ కు  లేఖ రాస్తూ.. జగన్ సర్కార్ తలపెట్టిన మూడు రాజధానులకు  సంబంధించిన బిల్లు, సీఆర్డీఏ రద్దు కు సంబందించిన బిల్లును  ఆమోదించొద్దు  అంటూ రాష్ట్ర గవర్నర్ కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే విపక్షాలపై ఎప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డి..తాజాగా యనమల  లేఖపై  స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


యనమలా! నీ పెన్నులో ఇంక్ అయిపోతుంది గానీ... నీ బెదిరింపు లెటర్స్ వల్ల ఉపయోగం లేదు. 
నీవు చెప్పిందే వేదమనుకుంటే ఎలా? గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలో నీవే చెప్తావా? ఏంటి కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాలొచ్చేస్తాయా? నీ కోరికలు నెరవేరవు - ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ నడవవు అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా యనమల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: