తెలంగాణ ప్రభుత్వం కరోనా విజృంభణ నేపధ్యం లో లాక్ డౌన్ ను పొడిగిస్తూ పోతున్న సంగతి తెలిసిందే .ఐతే ఇందులో కొన్ని సడలింపులు చేస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా మెట్రో రవాణా కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్కూళ్ళు ,కాలేజీ లు ,సినిమా హాళ్లకు ఇప్పట్లో అనుమతి ఇచ్చే అవకాశం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కండిషన్ లు పెడుతోంది .ప్రజల బాగు కోరుతూ సీఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


ఇది  ఇలా ఉంటె ఇక తాజాగా తెలంగాణ  శాసనసభాపక్షం ఈనెల 7న భేటీ కానుంది. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశానికి తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించారు,ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి తెరాస శాసనసభా పక్షం సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేయనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: